ఈ కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌తో ఎన్నో బెనిఫిట్స్!
- January 21, 2020
ఇండియా:డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తున్నవారికి ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈ స్కీమ్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఏకంగా కోటీశ్వరులు కావొచ్చు. ఎలాంటి రిస్క్ ఉండదు. కచ్చితనమైన రాబడి ఉంటుంది.
ఈ స్కీమ్ పేరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్). కేంద్ర ప్రభుత్వం పీపీఎఫ్ అకౌంట్‌పై 7.9 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. ఈ వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారొచ్చు. మోదీ సర్కార్ మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. అంటే వడ్డీ రేటు పెంచొచ్చు. లేదా తగ్గించొచ్చు. ఇదీకాకపోతే అలాగే స్థిరంగా కొనసాగించొచ్చు. వడ్డీ రేటు సంవత్సరానికి ఒకసారి మీ అకౌంట్‌కు జమవుతూ వస్తుంది.
మీరు పీపీఎఫ్ ఖాతాను 25 ఏళ్లలో ప్రారంభిస్తే.. ప్రస్తుత వడ్డీ రేటు 7.9 శాతం ప్రకారం.. 35 ఏళ్లలో మీరు ఏకంగా రూ.కోటికి పైగా పొందొచ్చు. దీని కోసం మీరు ప్రతి నెలా రూ.5,000 డిపాజిట్ చేస్తూ రావాలి.
పీపీఎఫ్ అకౌంట్లో ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి వీలవుతుంది. అంటే మీరు ఈ మొత్తాన్ని పీపీఎఫ్ ఖాతాలో ఇన్వెస్ట్ చేస్తే 35 ఏళ్ల తర్వాత (రిటైర్మెంట్ తర్వాత) ఏకంగా రూ.2.7 కోట్లు పొందొచ్చు.
అదే మీరు ఒకవేళ 30 ఏళ్ల వయసులో పీపీఎఫ్ ఖాతాను ప్రారంభిస్తే.. అప్పుడు మీరు 30 ఏళ్ల తర్వాత రూ.కోటి పొందాలంటే అప్పుడు నెలకు రూ.7,189 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అదే మీరు ఏడాదికి రూ.1.5 లక్షలు పీపీఎఫ్ ఖాతాలో డిపాజిట్ చేస్తే.. అప్పుడు మీకు 30 ఏళ్ల తర్వాత చేతికి రూ.1.8 కోట్లు వస్తాయి.
పీపీఎఫ్ అకౌంట్ మెచ్యూరిటీ సాధారణంగా 15 ఏళ్లు ఉంటుంది. మీరు ప్రతి ఏడాది రూ.1.5 లక్షల్ ఇన్వెస్ట్ చేస్తూ వస్తే.. అప్పుడు మీకు 15 ఏళ్ల తర్వాత చేతికి రూ.43 లక్షలు వస్తాయి. పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలాన్ని ఐదేళ్ల కాల పరిమితితో పొడిగించుకోవచ్చు. పీపీఎఫ్ అకౌంట్లో ఇన్వెస్ట్ చేసిన డబ్బుకు పన్ను మినహాయింపు ప్రయోజనాలు ఉంటాయి. ఇన్వెస్ట్ చేసిన డబ్బు, వచ్చే వడ్డీ, విత్‌డ్రా చేసుకునే డబ్బుపై ఎలాంటి పన్ను ఉండదు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







