సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
- January 23, 2020
సింగపూర్:సింగపూర్ తెలుగు సమాజం అనాదిగా నిర్వహించే సంక్రాంతి సందడి ఈ ఏడాది రెండు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు.మన భాష, సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించడమే ధ్యేయంగా పనిచేస్తున్న సింగపూర్ తెలుగు సమాజం, ఈ కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధం గా పండుగ వాతావరణం లో నిర్వహించారు.
మొదటిరోజు వామనగుంటలు,దాడి, పచ్ఛీసు,అష్టాచమ్మా, పరమపదసోపానం,గోళీలాట, బొంగరాలు ,గాలిపటాలు మొదలగు సంప్రదాయ ఆటలు ,ముగ్గుల పోటీలు, వంటల పోటీలు, సంక్రాంతి లక్ష్మిపూజ,హరిదాసు,గొబ్బిళ్ళ ఆటపాటల కోలాహలంతో అచ్ఛతెలుగు సంక్రాంతి శోభ ఉట్టిపడింది. అనంతరం స్ధానిక బాలబాలికలు, యువతీ యువకులచే వైవిధ్యభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాకుండా రాజమండ్రి నుంచి విచ్చేసిన గాయనీగాయకులు నవీన్ మరియు భవ్యలచే ఆనాటి మధురాలనుండి ఈనాటి హుషారైన కుర్రకారు పాటల తో నిర్వహించిన సినీ గాన విభావరి అందరినీ ఉర్రూతలూగించింది. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతుల తో పాటు ప్రశంసాపత్రాలను అందించారు. ఈ సంబరాలలో సింగపూర్ కాలమానం లో గుణించిన సింగపూర్ తెలుగు 2020 క్యాలెండెర్ ను ఆవిష్కరించారు. అచ్ఛమైన సంక్రాంతి తెలుగు పిండివంటలు, వంటకాలతో కూడిన తెలుగు సాంప్రదాయ భోజనం స్థానిక తెలుగు వారిని విశేషంగా ఆకట్టుకొంది.
ఇంకా రెండవరోజు హైదరాబాద్ నుంచి విచ్చేసిన గాన విద్యా ప్రవీణ, ప్రముఖ శాస్త్రీయ లలిత సంగీత గాయకులు , స్వరకర్త గరికపాటి వెంకట ప్రభాకర్ చే నిర్వహించిన వైవిధ్యభవితమైన రాగావధానం సింగపూర్ వాసులను విశేషంగా ఆకట్టుకొంది. అనేకరాగాలలో పృచ్ఛకులు అడిగిన అంశాలతో ప్రభాకర్ అద్వితీయంగా , అలవోకగా గానం తో సమాధాన పరచటమే కాకుండా అందులోని రసభావం, తాళప్రక్రియలు, రాగ, భావ మార్పులు , పద్యం, శ్లోకం మొదలగు అంశాలతో రక్తికట్టించి ప్రదర్శించి ప్రేక్షకుల అభినందనలను పొందారు. దీనిలో భాగంగా అవధాని ద్వారా శిక్షణ పొందిన సింగపూర్ బాలబాలికలు పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. అనంతరం తెలుగు సమాజం కార్యవర్గం ప్రభాకర్ ని ఘనంగా సన్మానించారు. ఈ అవధాన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న ప్రతిఒక్కరికీ
నిర్వాహకులు నరాల సిద్దారెడ్డి , మల్లిక్ పాలెపు కృతజ్ఞతలు తెలియజేశారు.
తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు స్వాగత వచనాలు పలికారు. గత రెండు సంవత్సరాలు కార్యవర్గాన్ని ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలపుతూ , రానున్న రెండు సంవత్సరాలు కూడా సహాయ సహకారాలు అందిస్తే సమాజాన్ని మరింత ప్రగతి పధం లోకి తీసుకెళ్ళడమే కాకుండా , సమాజం యెక్క సొంత భవనం అనే కలను సాకారం చేసుకోగలమని , ఆవిధంగా అందరిముందుకు బృహత్తర ప్రణాళిక తో తమ కార్యవర్గం రాబోతున్నట్లు ప్రకటించారు. భావితరాల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించటానికి, తెలుగు సమాజాన్ని మరింత పరిపుష్టం చేయటానికి యూత్ వింగ్ ని ఏర్పాటు చేసి వారిని కూడా ఈకార్యక్రమం ద్వారా భాగస్వామ్యులని చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.
నిర్వహణ కార్యదర్శి ప్రదీప్ సుంకర, శ్రీనివాసరెడ్డి పుల్లన్న భోగి పండుగ సందర్భంగా సుమారు వెయ్యి మందికి రేగుపండ్ల ప్యాకెట్స్ ని ఉచితంగా పంపిణీ చేసి మన భోగిపళ్ళ సంప్రదాయాన్ని ప్రోత్సహించామని ఒక ప్రకటనలో తెలిపారు. ఆహ్లాదభరితంగా జరిగిన ఈకార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ,స్వచ్ఛంద సేవకులకు,కార్యవర్గానికి , కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్లకు సింగపూర్ తెలుగు సమాజం కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలను తెలియజేసారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు