బుల్లితెర ప్రముఖ నటి ఆత్మహత్య..!
- January 25, 2020
ముంబై:ముంబైలో బుల్లితెర ప్రముఖ నటి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబై నగరంలోని మీరారోడ్డులో వెలుగు చూసింది. టీవీ ప్రముఖ నటి అయిన సెజల్ శర్మ తన ఇంట్లోని గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాగా సెజల్ శర్మ ఇప్పటికే 'దిల్ తో హ్యాపీ హై జీ' టీవీ సీరియల్‌లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.
అయితే సెజల్ శర్మ ఆత్మహత్య చేసుకున్న గదిలో సూసైడ్ నోట్ కూడా లభించింది. అంతేకాదు నటి సేజల్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆమె ఇంట్లోనే ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. మరి టీవీ నటి సేజల్ ఆత్మహత్యకు అసలు కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియలేదు.
కాగా ఈ ఘటనపై పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి సేజల్ శర్మ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు.. అసలు ఆమెనే సూసైడ్ లెటర్ రాసిందా? లేక మరెవరైనా రాసి ఆలా పెట్టారా? సేజల్ శర్మది అసలు ఆత్మహత్యేన.. లేక హత్యనా? ఆమె ఆత్మహత్య చేసుకున్న సమయం ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు స్నేహితులు ఎందుకు ఆపలేదు అనే కోణంలో ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి సేజల్ శర్మ ఆత్మహత్యకు అసలు కారణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!