శంషాబాద్:కడుపులో బంగారం స్మగ్గ్లింగ్...పట్టుబడ్డ ప్రయాణికులు
- January 25, 2020
శంషాబాద్:శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న రాత్రి కోటిన్నర రూపాయలకు పైగా విలువైన బంగారాన్ని తరలిస్తూ నలుగురు వేరు వేరు ప్రయాణికులు పట్టుబడ్డారు. ఏకంగా 4కిలోల బంగారం పట్టుబడింది. దుబాయ్, మస్కట్ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికుల నుంచి 4 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే అలా తరలిస్తున్నారు ప్రయాణికులను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దుబాయ్, మస్కట్ నుండి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు బంగారంను గుళికలు.. పేస్ట్ రూపంలో మర్చి కడుపులో దాచుకొని వచ్చారు.
అయితే.. వారి కడుపులో బంగారం ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. శస్త్ర చికిత్స చేయించి, 928 గ్రాముల బంగారాన్ని బయటకు తీశారు. అయితే వీళ్ళు బంగారంను కడుపులో పెట్టుకోగా.. దుబాయ్ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడు 840.98 గ్రాముల బంగారాన్ని నల్లరంగు టేపులో చుట్టి తీసుకురాగా అతన్ని గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు.
మస్కట్ నుంచి వచ్చిన ఇంకో ప్రయాణికుడు మైక్రోవేవ్ ఓవెన్లో 700 గ్రాముల బంగారాన్ని తీసుకొస్తుండగా.. పట్టుకున్నారు.ఇలా నలుగురు ప్రయాణికుల వద్ద నుండి 4 కేజీల బంగారాన్ని పట్టుకున్నారు పోలీసులు.కాగా వీడోక్కడే సిన్ ని తలిపించిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా అవుతుంది. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలకోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు