విజయవాడ నుండి గల్ఫ్ దేశాలకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కొత్త సర్వీసు
- January 25, 2020
విజయవాడ:ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పరోక్ష కృషి కారణంగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కొత్త సర్వీసుకు శ్రీకారం చుట్టింది. దోహా, షార్జాలకు విమాన సర్వీసులను (ముంబయి అనుసంధానంతో) నడపాలని నిర్ణయించింది. ఆయా దేశాలకు విమాన సర్వీసులను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ వెబ్ బుకింగ్ పోర్టల్‌ను సిద్ధం చేసింది. ఈ రెండు దేశాలు వెళ్లే ప్రయాణికులు విజయవాడ నుంచే బయల్దేరవచ్చు. వారంలో మంగళ, బుధ, శనివారాల్లో ఈ సర్వీసు నడుస్తుంది. ప్రయాణికుల సెక్యూరిటీ చెక్ ఇన్ విజయవాడ విమానాశ్రయంలోనే నిర్వహిస్తారు. ఆయా దేశాలకు వెళ్లే ప్రయాణికులకు బోర్డింగ్ పాస్‌లు కూడా ఇక్కడే ఇస్తారు. లగేజీని హ్యాండోవర్ చేస్తే చాలు.. విమానంలో ఎక్కి కూర్చోవటమే. కస్టమ్స్, ఇమిగ్రేషన్ చెక్ ఇన్ మాత్రం ముంబయి విమానాశ్రయంలో ఉంటుంది.
చౌక విదేశీ ప్రయాణం
ఈ రోజు నుంచి ప్రారంభంకానున్న దోహా, షార్జా సర్వీసుల్లో చౌకగా ప్రయాణించవచ్చు. విజయవాడ నుంచి షార్జాకు వాల్యూ ప్యాక్ కింద రూ.10,819 ధరగా నిర్ణయించారు. అదే ఫ్లెక్సీ ప్యాక్ కింద అయితే రూ.34,339 నిర్ణయించారు. విజయవాడ నుంచి దోహాకు వాల్యూ ప్యాక్ కింద అయితే రూ.12,815, ఫ్లెక్సీ ప్యాక్ కింద అయితే రూ.49,565 నిర్ణయించారు. ఈ రోజు ప్రయాణానికి అప్పుడే టికెట్లు అయిపోవడం విశేషం.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..