యూఏఈ: అబుధాబి లో ఘనంగా గణతంత్య్ర దినోత్సవ వేడుకలు
- January 26, 2020
అబుధాబి: అబుధాబి లోని భారత రాయబార కార్యాలయంలో వందలాది మంది భారతీయులు 71 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాలుపంచుకున్నారు. యూఏఈ-భారత రాయబారి పవన్ కపూర్ ముందుగా భారత జాతిపిత అయిన మహాత్మా గాంధీ కి పుష్పాంజలి సమర్పించి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. భారతీయులంతా ఈ కార్యక్రమంలో దేశభక్తి గీతాల్ని ఆలపించారు. జాతీయ పతాకావిష్కరణ తర్వాత పవన్ కపూర్ అక్కడికి చేరుకున్న భారతీయుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని చదివి వినిపించారు. అటుపై ఆయన మాట్లాడుతూ; రాయబార కార్యాలంయం అన్నివేళలా ప్రవాసీయులకు చేయూత అందించేందుకు సిద్ధంగా ఉంది అని అన్నారు. లేబర్ వర్కర్స్ తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, రాయబార కార్యాలయానికి తెలపవచ్చు లేదా మీ సమీపంలోని 'ప్రవాసి భారతీయ సహాయత కేంద్రం' (PBSK - Pravasi Bhartiya Sahayata Kendra: 80046342) ను సంప్రదించవచ్చని తెలిపారు. అటుపై చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమంలో కపూర్ పాల్గొన్నారు.
--సుమన్ (మాగల్ఫ్ ప్రతినిధి, అబుధాబి)
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!