దుబాయ్:మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఇండియన్ కి 3 నెలల జైలు శిక్ష
- January 28, 2020
దుబాయ్ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఇండియన్ కు మూడు నెలల జైలు శిక్ష పడింది. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం..33 ఏళ్ల ఇండియన్ షాపింగ్ మాల్ లో మహిళలను ఉద్దేశ్యపూర్వకంగా తాకుతూ లైంగిక వేధించినట్లు బాధితురాలు ఆరోపించింది. అల్ రషిదియా పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఏడాది ఆగస్ 2న ఈ ఘటన చోటు చేసుకుంది. 35 ఏళ్ల సిరియన్ లేడీ తన పిల్లలు, మదర్ తో కలిసి టాయ్స్ కొనేందుకు షాపింగ్ మాల్ వెళ్లినట్లు తెలిపింది. ఆ సమయంలో నిందితుడు తనను అసభ్యకరంగా ఎగదిగా చూస్తూ వెంబడించాడని..టాయ్స్ కొనే సమయంలో ఒక్కసారిగా మరింత దగ్గరగా వచ్చి పట్టుకున్నట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. గట్టిగా అరవటంతో మాల్ లో జనం వచ్చి అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించింది. షాపింగ్ మాల్ లోని సీసీ కెమెరా ఫూటేజ్ పరిశీలించిన పోలీసులు ఇండియన్ వ్యక్తి మిస్ బిహేవ్ చేసినట్లు నిర్ధారించుకున్నారు. సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు నిందితుడికి 3 నెలల జైలు శిక్ష విధించింది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..