ఈ-సేవతో సౌదీస్ కు బెటర్ సర్వీస్...ఈజీగా ఇండియా వీసా పొందే ఛాన్స్
- January 28, 2020
సౌదీ అరేబియా:ఇండియా విజిట్ చేసే సౌదీస్ కి ఈ-సేవ సర్వీస్ తో మునుపెన్నడూ లేనంత ఈజీగా, చౌకగా వీసా పొందొచ్చు. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ గత ఏడాది ఫిబ్రవరిలో భారత్ లో పర్యటించిన సందర్భంగా ఈ-సేవ సర్వీస్ ప్రకటించిన విషయం తెలిసింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపరిచేలా తీసుకొచ్చిన ఈ-సేవ సర్వీస్ గత జూన్ 17 నుంచి ప్రారంభమైంది. దీంతో ఇండియాకు వెళ్లే సౌదీస్ కి టూరిస్ట్, బిజినెస్, మెడికల్, కాన్ఫరెన్స్ వీసాలను ఈ-సేవ ద్వారా పొందే వెసులుబాటు ఏర్పడింది. సౌదీ-భారత్ బంధాన్ని బరింత బలపరిచేలా ఇక ఇప్పుడు ఈ-సేవ సర్వీస్ లో ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వీసా ఫీజులో రాయితీలు ప్రకటించింది. వన్ ఇయర్ మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా కాస్ట్ ను 80 డాలర్ల నుంచి 40 అమెరికన్ డాలర్లకు తగ్గించింది. ఒక నెలలో డబుల్ విజిట్ చేసే షార్ట్ టర్మ్ వీసా 25 డాలర్లు, ఏప్రిల్- జూన్ మధ్య
జారీ చేసే వీసాలకు 10 అమెరికన్ డాలర్ల ఛార్జ్ చేయనుంది. ఫైవ్ ఇయర్స్ మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా కాస్ట్ ను 80 అమెరికన్ డాలర్లుగా నిర్ధారించింది. ఈ-సేవ ద్వారా వీసా పొందాలనుకునే వారు ట్రావెల్ డేట్ కు నాలుగు రోజుల ముందు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ-సేవ వీసాలతో పాటు పేపర్ వర్క్ ద్వారా పొందే మాన్యువల్ వీసాలు ఇండియన్ ఎంబసీ కొనసాగించింది. లాస్ట్ ఇయర్ సౌదీస్ కి 19,116 ఈ- సేవ వీసాలు, 18, 598 పేపర్ వీసాలను మంజూరు చేసింది.
ఈ-వీసా కు సంబంధించి https://indianvisaonline.gov.in/evisa/tvoa.html. ద్వారా మరింత సమాచారం పొందవచ్చు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..