యూఏఈ: గవర్నమెంట్ ఆస్పత్రుల్లో రోబో డాక్టర్...పేరు డాక్టర్ షిఫా

- January 28, 2020 , by Maagulf
యూఏఈ: గవర్నమెంట్ ఆస్పత్రుల్లో రోబో డాక్టర్...పేరు డాక్టర్ షిఫా

యూఏఈ:మీ ఆరోగ్య సమస్యలపై అనుమానాలు నివృత్తి చేసుకోవాలా? ఏ జబ్బుకు ఏ స్పెషలిస్ట్ డాక్టర్ ను సంప్రదించాలో అర్దంగాక అయోమయంలో ఉన్నారా? ఇకపై ఇలాంటి కంగారు అవసరం లేదు. డాక్టర్ దగ్గరకు వెళ్లి అపాయింట్మెంట్ కోసం ఎదురుచూడాల్సిన పనిలేదు. డాక్టర్ కు పేషెంట్ ఏకకాలంలో సేవలు అందించేలా రోబో డాక్టర్ అందుబాటులోకి వచ్చింది. పేరు డాక్టర్ షిఫా. ఈ రోబో డాక్టర్ అరబిక్, ఇంగ్లీష్, చైనీస్ భాషల్లో పేషెంట్లతో మాట్లాడగలుగుతుంది. వాయిస్ కాన్ఫరెన్స్ తో పేషెంట్లు తమ హెల్త్ ఫైల్స్ ను డాక్టర్ షిఫా దగ్గర అప్ డేట్ చేసుకోవచ్చు. రిపోర్ట్స్ మీద అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు. ఈ రోబో డాక్టర్ లో హెల్ ఇష్యూస్ అప్ డేట్ చేస్తే డేటాబేస్ సెంటర్ ద్వారా ఏక కాలంలో వరల్డ్ వైడ్ గా ఉన్న స్పెషలైజ్ సెంటర్స్ కి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. వెంటనే బెస్ట్ సొల్యూషన్ పెషెంట్స్ కు ట్రాన్స్ ఫర్ చేస్తుంది. రోబో డాక్టర్ సేవలను యూఏఈలోని అన్ని గవర్నమెంట్ ఆస్పత్రుల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం మూడు భాషల్లోనే సర్వీస్ అందుస్తున్నా..త్వరలోనే మరిన్ని లాంగ్వేజెస్ లో మాట్లాడేలా రోబోను డెవలప్ చేస్తామని విల్ టెక్ టెక్నాలజీ కంపెనీ చెబుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com