ప్రపంచంలోనే అతిపెద్ద యోగా కేంద్రంగా రికార్డులు సృష్టిస్తోంది ఈ ధ్యాన మందిరం
- January 28, 2020
ప్రపంచంలోనే అతిపెద్ద యోగా కేంద్రంగా రికార్డులు సృష్టిస్తోంది హైదరాబాద్ లోని ధ్యాన మందిరం.. మంగళవారం నుంచి నగరవాసులకు అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా ముఖ్య అతిథిగా హాజరై.. ఈ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించారు. శంషాబాద్ సమీపంలోని కన్హ గ్రామంలో.. హార్ట్ ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో ఈ ధ్యాన మందిర నిర్మాణం జరిగింది. మొత్తం 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ ధ్యానమందిరాన్ని ఏర్పాటు చేశారు. దీనిని తాబేలు ఆకారంలో నిర్మించారు. దీనిలో ఒకేసారి లక్షమంది ధ్యానం చేసేందుకు వీలుగా దీనిని నిర్మించారు. హార్ట్ ఫుల్నెస్ సంస్థ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఈ ధ్యానకేంద్రాన్ని ఏర్పాటుచేసి ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం







