తెలుగులోనూ రాణించాలన్నదే నా కోరిక 'బాలికా వధు' ఫేమ్ షీతల్ ఖండల్
- January 28, 2020
దేశవ్యాప్తంగా బుల్లి తెర ప్రేక్షకులను ఉర్రూతలూగించిన 'బాలికా వధు' సీరియల్ లో 'గెహనా'గా నటించిన షీతల్ ఖండల్ గురించి తెలియనివారు ఉండరు. ఈ సీరియల్ 'చిన్నారి పెళ్లికూతురు' పేరుతొ తెలుగులోనూ ప్రసారమై ఇక్కడి ప్రేక్షకుల హృదయాలు కూడా గెలుచుకొంది. 'బాలికా వధు'తో వచ్చిన గుర్తింపు షీతల్ ను ఓవర్ నైట్ స్టార్ ని చేసేసింది. లెక్కకు మిక్కిలి అవార్డులు ఆమెను వరించాయి. 'వారియర్ సావిత్రి' అనే హిందీ సినిమాలోనూ నటించి మెప్పించిన షీతల్.. తన మాతృ భాష రాజస్తానీలో ప్రముఖ హీరోయిన్ గా వెలుగొందుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాలకు సైన్ చేసి.. ఒక ఇండో అమెరికన్ సినిమాలోనూ నటిస్తున్న షీతల్.. త్వరలోనే తెలుగులోనూ తెరంగేట్రం చేయాలని తహతహలాడుడుతోంది. సహజసిద్ధమైన అందం, అభినయం, శభాష్ అనిపించే నాట్య కౌశలం కలిగిన ఈ రాజస్థానీ భామకు తెలుగులో ఎవరైనా పిలిచి అవకాశాలు ఇస్తారేమో వేచి చూడాలి!!
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







