నిర్భయ దోషి పిటిషన్ కొట్టేసిన కోర్టు..ఉరి ఖరారు
- January 29, 2020
నిర్భయ దోషులను ఉరి తీసేందుకు మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండటంతో కొత్త విషయాలను తెరపైకి తెస్తున్నారు దోషుల తరపు న్యాయవాదలు. క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముకేష్ సింగ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ముకేష్ సింగ్ తరపు న్యాయవాది సంచలన ఆరోపణలు చేశారు. తీహార్ జైల్లో ముకేష్ సింగ్‌పై లైంగిక దాడి జరిగినట్టు ఆరోపించారు. గ్యాంగ్ రేపులో దోషిగా తేల్చి కోర్టు మరణ శిక్ష విధిస్తే...జైల్లో మాత్రం ముకేష్ పై అత్యాచారం జరిగిందని ఆయన తరపు న్యాయవాది వాదించారు. క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతికి పంపే విషయంలోనూ నిబంధనలు పాటించలేదని పిటిషనర్ వాదించారు..క్షమాభిక్ష కోసం రాష్ట్రపతి పరిగణలోకి తీసుకునే జైలర్ నివేదికను ప్రెసిడెంట్‌కు పంపలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన విషయంలో ప్రతి ఒక్క అంశాన్ని పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని వాదించారు ముకేష్ లాయర్ అంజనా ప్రకాష్. నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో చనిపోయిన మరో నిందితుడు రామ్ సింగ్ వ్యవహారాన్ని కూడా ప్రస్తావించారు.. తీహార్ జైల్లో రామ్ సింగ్ ను హత్యచేశారని కానీ ఆత్మహత్యగా చిత్రీకరించి కేసును క్లోజ్ చేశారన్నారు. ఇక ఈరోజు ఉదయం నిర్భయ దోషి ముఖేష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉరిశిక్ష తప్పించుకునేందుకు నిర్భయ దోషులు ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేశారు. అన్ని మార్గాలు దాదాపుగా మూసుకుపోయాయి. ముకేష్ పిటిషన్ ను ఇవాళ కోర్టు తిరస్కరించింది కాబట్టి షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 1 ఉదయం 6 గంటలకు ఆ నలుగురు ఉరికంబం ఎక్కుతారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







