మిథాలీ రాజ్ బయోపిక్ ఫస్ట్ లుక్
- January 29, 2020
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హిందీ, తెలుగు, తమిళం. ఇలా భాషలతో సంబంధం లేకుండా బయోపిక్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకి సంబంధించి ఇప్పటికే పలు బయోపిక్ చిత్రాలు రూపొందాయి. తాజాగా ప్రపంచ మహిళా క్రికెట్‌లోనే అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత నేపథ్యంలో చిత్రం రూపొందుతుంది. సుదీర్ఘకాలం ఇండియాకు ప్రాతినిథ్యం వహించిన మిథాలీ ఇటీవల టీ 20లకి గుడ్ బై చెప్పింది. 2018లో ఆమె జట్టు తరఫున కీలకంగా వ్యవహరించారు.ఇప్పుడు ఆమె జీవితాన్ని వెండితెరపైకి తీసుకొచ్చేందుకు వయాకామ్ 18 సంస్థ సన్నాహాలు చేస్తుంది. రాయీస్ ఫేమ్ రాహుల్ దొలాకియా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. "శభాష్ మిథు" పేరుతో చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో మిథాలీ పాత్రలో తాప్సీ నటిస్తుంది. రాయీస్ ఫేమ్ రాహుల్ దొలాఖియా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శభాష్ మిథు అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ కొద్ది సేపటి క్రితం విడుదలైంది. ఇందులో తాప్సీ .. మిథాలీ పాత్రలో ఒదిగిపోయింది. స్టైలిష్ షాట్ కొడుతున్నట్టుగా కనిపిస్తుంది. 2021 మేలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు పోస్టర్ ద్వారా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







