భారత్ లో పర్యటించనున్న ట్రంప్
- January 29, 2020
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి నెల చివరి వారంలో భారత్‌లో పర్యటించనున్నారని సమాచారం. ఇందుకు అనుగుణంగా ఢిల్లీలో ట్రంప్ బస చేసేందుకు హోటల్ బుకింగ్స్, ఇతర కార్యక్రమాల విషయంలోనూ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ట్రంప్ భారత పర్యటనకు ముందుగా ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలు జరిగే అవకాశముంది.
ఇందు కోసం అమెరికా వాణిజ్య వ్యవహారాల ప్రతినిధి రాబర్ట్ లైతిజర్ ఫిబ్రవరి రెండో వారంలో భారత పర్యటనకు రానున్నారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ కానున్నారు. ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలోనూ వీరిద్దరూ విడిగా భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చించారు. రాబర్ట్ లైతిజర్ భారత పర్యటన తర్వాత ఫిబ్రవరి చివర్లో డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వస్తారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్ పలు కీలక వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ట్రంప్ పర్యటన జరుగనుంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు