దుబాయ్ : స్మగ్లింగ్ రాకెట్ బ్లాస్ట్.. 73 కేజీల క్రిస్టల్ మెత్ సీజ్
- January 29, 2020
జెబెల్ అలీ కస్టమ్స్ సెంటర్ టీం క్రిస్టల్ మెత్ స్మగ్లింగ్ రాకెట్ ను బ్లాస్ట్ చేసింది. స్మగ్లర్ల నుంచి 73 కిలోల క్రిస్టల్ మెత్ ను స్వాధీనం చేసుకుంది. వెహికిల్ స్పెర్ పార్ట్స్ లో డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు ముందస్తు సమాచారం ఉండటంతో మత్తుపదార్థాల రవాణాను సమర్థవంతంగా అడ్డుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇల్లీగల్ గూడ్స్, డ్రగ్స్ సరఫరాను అడ్డుకునేందుకు, వాటిని గుర్తించేందుకు అధునాతన ఇక్విప్మెంట్ ఉందని జెబెల్ అలీ కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. తమ దగ్గర ఉన్న స్మార్ట్ స్కానింగ్ సిస్టమ్ తో ఒక గంటలనే 150 కంటేనర్లను స్కాన్ చేయవచ్చని వెల్లడించారు. ప్రస్తుతం తమ దగ్గర 6 స్కానర్లు ఉన్నాయని, వాటి ద్వారా గంటలో 900 కంటేనర్లను సునిశితంగా స్కాన్ చేసే అవకాశం ఉందన్నారు. తమకు ఎప్పటికప్పుడు దుబాయ్ యాంటీ నార్కొటిక్ డిపార్ట్మెంట్ సహాకారం అందుతోందని..వారి సహకారానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ప్రతీ ఎంట్రీ పాయింట్ దగ్గర ఉన్న అధునాతన స్కానర్లతో ప్రతీ కంటెనర్ ను క్షణ్ణంగా తనిఖీ చేపడుతున్నామని చెప్పారు.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!