సమత కేసులో నిందితులకు ఉరిశిక్ష విధించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు
- January 30, 2020
ఆదిలాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సమతా కేసులో ఆదిలాబాద్ న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించింది. అనేక పరిణామాల మధ్య దోషులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు గురువారం తుది తీర్పు ఇచ్చింది. సమతా హత్యాచార నిందితులు షేక్ బాబు, షేక్ షాబూద్దీన్, షేక్ మగ్దూం లను దోషులుగా గుర్తిస్తూ ఉరిశిక్ష విధించింది. నిందితుల తరుపున రహీం న్యాయవాది వాదించగా.. కోర్టుకు కొమురం భీం ఎస్పీ మల్లారెడ్డి హాజరయ్యారు.
ముందుగా నిందితులను జైలు అధికారులు కోర్టులో ప్రవేశపెట్టగా.. నిందితులను కోర్టు హాలులోకి పిలిచిన జడ్జి వారి కుటుంబ వివరాలను జడ్జి అడిగి తెలుసుకున్నారు. నేరం రుజువైందని నిందితులకు చెప్పారు. కుటుంబానికి తామే ఆధారమంటూ న్యాయమూర్తి ముందు నిందితులు కన్నీరు పెట్టుకున్నారు. ముగ్గురు నిందితులకు నలుగురు పిల్లలురున్నారని, శిక్ష తగ్గించాలని వేడుకున్నారు. కాగా సమతా భర్త గోపి, కుటుంబ సభ్యులు కోర్టుకు చేరుకున్నారు. అలాగే సమతా స్వగ్రామం గోనంపల్లె వాసులు సైతం కోర్టుకు భారీగా చేరుకున్నారు. దీంతో కోర్టు దగ్గర పోలీసుల మోహరించారు.
కేసుకు సంబంధించి ఈ రోజు(గురువారం) ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించనుంది. కేసుకు సంబంధించి ఈ నెల 20న వాదనలు పూర్తి కాగా, 27న ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరచనుండగా న్యాయమూర్తి అనారోగ్య కారణంగా ఈ నెల 30కు వాయిదా వేశారు. కొమురంభీం జిల్లా లింగాపూర్ అటవీ ప్రాంతంలోని ఎల్లపటార్లో నవంబర్ 24న ముగ్గురు నిందితులు షేక్ బాబా, షేక్ షాబుద్దీన్, షేక్ మగ్దూమ్లు సమతను అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. గురువారం తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







