కరోనా ఎఫెక్ట్: ఇంటి నుంచే పనులకు కంపెనీలు ఆదేశం...

- January 30, 2020 , by Maagulf
కరోనా ఎఫెక్ట్: ఇంటి నుంచే పనులకు కంపెనీలు ఆదేశం...

ఇప్పుడు ఎవరినోట విన్నా ఒక్కటే మాట... కరోనా వైరస్. ఈ వైరస్ ప్రాణాంతకంగా మారబోతున్నది. ఇప్పటికే 170 మందిని పొట్టన పెట్టుకుంది. చైనా యావత్తు గజగజలాడుతున్నది. ఈ వైరస్ బారిన పడిన వ్యక్తులు 28 రోజుల్లోపే మరణిస్తున్నారు. ఇది అందరిలోనూ తెలియని భయాన్ని కలిగిస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు 17 దేశాలకు పాకింది. దీంతో ప్రజలు అప్రమత్తం అవుతున్నారు. బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.

దీంతో చైనాలో ఉన్న దిగ్గజ సంస్థలు అప్రమత్తం అయ్యాయి. ఫేస్ బుక్, అలీబాబా వంటి దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటినుంచి పనిచేసే సౌలభ్యాన్ని కల్పించాయి. ఇంటినుంచి పనిచేయడం వలన కొంతమేర ఆ వైరస్ బారి నుంచి బయటపడొచ్చు అన్నది వారి వాదన. ఇక టెంసెంట్ సంస్థ ఉద్యోగులకు ఏకంగా సెలవులు ప్రకటించింది. వైరస్ వ్యాప్తి తగ్గే వరకు ఉద్యోగులకు సెలవులు ఇచ్చింది. యాపిల్ సంస్థ చైనా లో ఉన్న ఒక పెద్ద స్టోర్ ను తాత్కాలికంగా మూసేసింది. కొన్ని చోట్ల పనిగంటలను గణనీయంగా తగ్గించేసింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వానికి ఈ సంస్థలన్నీ కూడా ఇలానే సహకరిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com