దుబాయ్ లో రికార్డు సృష్టించిన డైమండ్ టాయిలెట్

- January 30, 2020 , by Maagulf
దుబాయ్ లో రికార్డు సృష్టించిన డైమండ్ టాయిలెట్

దుబాయ్: వజ్రాలతో చేయబడ్డ వస్తువులు మరియు బంగారు బర్గర్లు ఇలా ఎన్నో వింతలకు నెలవు దుబాయ్; ఇప్పుడు మరో వింతకు కేంద్రమైంది. జనవరి 28, మంగళవారం ‘ది అమేజింగ్ మ్యూజియం & ఆర్ట్ గ్యాలరీ’ లో వజ్రంతో కప్పబడిన టాయిలెట్ ను ఆవిష్కరించారు.

వజ్రాల ఆభరణాల తయారీదారు కొరోనెట్ జ్యువెలరీ మరియు హాంకాంగ్‌కు చెందిన ఆరోన్ షుమ్ జ్యువెలరీల విభాగం తయారుచేసిన ఈ టాయిలెట్ 40,815 వజ్రాలతో మొత్తం 334 క్యారెట్లను కలిగి ఉంది. దీని విలువ 1.28 మిలియన్ డాలర్లు (4.70 మిలియన్లు దిర్హాములు). అత్యధిక సంఖ్యలో వజ్రాలతో తయారుచేసిన ఈ టాయిలెట్ బౌల్‌ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను కైవసం చేసుకుంది. ప్రపంచంలోని అత్యంత విలువైన గిటార్ ($2 మిలియన్లు), హ్యాండ్‌బ్యాగ్‌లోని చాలా వజ్రాలు మరియు మొబైల్ ఫోన్ కేసులో సెట్ చేసిన వజ్రాల వంటివి తయారుచేసి గతంలో 10 రికార్డులు సాధించింది కొరోనెట్ సంస్థ.

ఈ టాయిలెట్ ఉపయోగం కాస్త అసౌకర్యంగా మార్చే ఆ వజ్రాల గురించి ఆందోళన చెందుతున్న వారు చెందవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇది కళాకృతి మాత్రమే అని ఉపయోగించని తయారుచేయలేదని; అయితే, డైమండ్ టాయిలెట్ కోసం డిమాండ్ ఉంటే, కస్టమర్ కోసం ఒకదాన్ని తయారుచేయగలనని తెలిపారు. కరోనెట్ జ్యువెలరీ సౌజన్యంతో ఈ టాయిలెట్ ఒక నెల పాటు మ్యూజియంలో ప్రదర్శనలో ఉంటుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com