సౌదీ అరేబియా:ప్రైవేట్ సెక్టార్ కు ఊతం..త్వరలో 20 బిజినెస్ ఇన్షియేటివీస్ లాంచ్

- January 30, 2020 , by Maagulf
సౌదీ అరేబియా:ప్రైవేట్ సెక్టార్ కు ఊతం..త్వరలో 20 బిజినెస్ ఇన్షియేటివీస్ లాంచ్

సౌదీ అరేబియా:ప్రైవేట్ సెక్టార్ లో బిజినెస్ ఎన్విరాన్మెంట్ ను మరింత బలోపేతం చేసేలా 20 కొత్త పథకాలను సౌదీ అరేబియా ప్రభుత్వం లాంచ్ చేయనుంది. స్థానికులకు ఉద్యోగ అవకాశాలను మరింత మెరుగుపర్చటంతో పాటు, అభ్యర్ధుల్లో పోటీతత్వాన్ని పెంపొందించేలా మినిస్ట్రి ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఈ కొత్త కార్యక్రమాలను చేపట్టనుంది. ఇందులో భాగంగా ప్రైవేట్ సెక్టార్, జాబ్ సీకర్స్ కు పలు వర్క్ షాప్ లను నిర్వహించనున్నారు. అలాగే ప్రభుత్వ ఎజెన్సీలతో సమావేశాలకు ఆస్కారం కల్పించటం ద్వారా అభ్యర్ధుల్లో అవగాహన పెంపొందించనున్నారు. అంతేకాదు..రిక్రూట్మెంట్ పాలసీలు, మెకానిజమ్ అభివృద్ధికి సహకరించనున్నారు. అలాగే ఆన్ లైన్ వీసా, సీజనల్ వీసాలకు సంబంధించి ఆన్ లైన్ పోర్టల్ నిర్వహణకు ప్రభుత్వం సహకారం అందించనుంది. సౌదీలో జాబ్ చేయాలనుకునే వారికి, ఉద్యోగులకు ట్రైనింగ్ అందించటంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కు కొత్త ఇన్షియేటీవ్స్ తోడ్పాటు అందించనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com