యూఏఈ తీరంలో భారతీయ నావికుల మృతి

- February 01, 2020 , by Maagulf
యూఏఈ తీరంలో భారతీయ నావికుల మృతి

యూఏఈ: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) సముద్ర తీరంలో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో ఇద్దరు భారతీయ నావికులు మృతి చెందారు. పనామాకు చెందిన ఈ చమురు ట్యాంకర్‌, బుధవారం రాత్రి షార్జా తీరానికి 21 మైళ్ల దూరంలో ఉండగా దానిలో మంటలు చెలరేగాయి. అయితే మంటలను అగ్నిమాపక దళ సహాయంతో వెంటనే అదుపులోకి తెచ్చామని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది...పలువురి ఆచూకీ తెలియకుండా పోయింది. అధికారిక సమాచారం ప్రకారం సంఘటన జరిగినప్పుడు ఆ ఓడలో 12 మంది నావికా సిబ్బందితో సహా 55 మంది ఉన్నారు.కాగా కనపడకుండా పోయిన వ్యక్తులు పాకిస్తాన్,ఇండియన్,బంగ్లాదేశ్,ఇథోపియా ఇతర దేశాలకు చెందిన వారు ఉన్నారు...అయితే వారిని వెతికే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని యూఏఈ ఫెడరల్‌ అథారిటీ ఫర్‌ లాండ్‌ అండ్‌ మ్యారీటైమ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అధికారులు తెలిపారు.

ఇండియన్ కాన్సుల్ జనరల్ విపుల్ మాట్లాడుతూ... జనవరి 29 న షార్జా తీరంలో ఎమ్‌టి సామ్ నౌకలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు  భారతీయులు మరణించినట్లు స్థానిక అధికారులు కాన్సులేట్‌కు తెలియజేశారు.ఇద్దరు భారతీయులు గాయపడ్డారు మరియు ఆసుపత్రిలో ఉండగా ఇద్దరు ఇంకా కనిపించలేదు. గాయపడిన వారిని చూడటానికి మా అధికారులు ఆసుపత్రిని సందర్శించారని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com