చూసీ చూడంగానే థాంక్స్ మీట్!!
- February 01, 2020
ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై శేష సింధు దర్శకత్వంలో రాజ్ కందుకూరి నిర్మించిన చిత్రం ‘చూసీ చూడంగానే`.వర్ష బొల్లమ్మ, మాళవిక హీరోయిన్స్. జనవరి 31న సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా గ్రాండ్‌గా విడుదలై పాజిటీవ్ టాక్ తో మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో థాంక్స్ మీట్ ను నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా...
చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ - నేను ఎప్పుడు సినిమా తీసినా ఓ పరీక్ష లాగానే ఉంటుంది. రిజల్ట్ మేము అనుకున్న దానికి కాస్త అటు ఇటుగా వస్తుంటుంది. ఈ సినిమాకి కూడా మంచి స్పందన లభిస్తుంది. సినిమా బాగుందని అందరు ఫోన్ చేసి ప్రశంసిస్తున్నారు. యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీగా ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుంది. కొత్త దర్శకురాలైనా శేషసింధు ది బెస్ట్ అవుట్ పుట్ అందించారు. ఆరిస్టులు, టెక్నీషియన్లు చాలా కష్టపడి బాగా చేశారు. ముఖ్యంగా వెంకటేష్ కామెడీబాగా పండింది. హీరోయిన్ గా తెలుగులో వర్ష బొల్లమ్మకిది మంచి లాంచ్ అవుతుంది. మాళవిక తన పెర్‌ఫామెన్స్‌తో అందరినీఆకట్టుకుంది. మా అబ్బాయి శివకు మొదటి సినిమా అయినా అనుభవం ఉన్న ఆరిస్టులా నటించాడని అందరూఅంటున్నారు సినిమాకి పూర్తి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడం చాలా సంతోషంగా ఉంది. మా చిత్రాన్ని ఆదరిస్తున్న ఆడియెన్స్ కిథ్యాంక్స్. అలాగే సినిమాని విడుదల చేసిన సురేష్ బాబు గారికి, మధుర శ్రీధర్ గారికి ధన్యవాదాలు' అన్నారు.
దర్శకురాలు శేష సింధు మాట్లాడుతూ - `` సినిమా చూసిన వాళ్ళందరూ చాలా బాగుందని ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా మా హీరో శివకి, హీరోయిన్లు వర్ష, మాళవిక కి ఈ సినిమా ద్వారా మంచి పేరొచ్చింది. సినిమాకి ఇంత పాజిటీవ్ రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాత రాజ్ కందుకూరి గారికి థాంక్స్. అలాగే మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు`` అన్నారు.
హీరో శివ కందుకూరి మాట్లాడుతూ - ``చాలా నేచురల్ గా సినిమాను తీయాలనుకున్నాం అవుట్ పుట్ కూడా అలానే వచ్చింది. యూత్ తో పాటు అన్ని వర్గాలకు మా సినిమా కనెక్ట్అవుతుంది. నాకిది డెబ్యూ అయినా బాగా చేశానని అంటుంటే సంతోషం గా ఉంది. నటుడు వెంకటేష్ వల్ల నేచురల్ కామెడీ బాగా పండింది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ని కొత్తగా ప్రయత్నించారు. దాని వల్లే ఆడియన్స్‌కి ఫ్రెష్ ఫీలింగ్ కలిగింది. ఓ హీరోగా మొదటి సినిమా కి ఇంత కంటే బెటర్ రెస్పాన్స్ఆశించలేదు. సినిమాని విడుదల చేసిన సురేష్ బాబు గారికి, మధుర శ్రీధర్ గారికి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థాంక్స్`` అన్నారు.
మొదటి సినిమాకే ఇంతమంచి రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి దన్యవాదాలు అని హీరోయిన్స్ వర్ష బొల్లమ్మ, మాళవిక అన్నారు.
ఈ కార్యక్రమంలో నటుడు వెంకటేష్, రైటర్ పద్మ పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







