అమరావతి నినాదాన్ని ఢిల్లీలో వినిపించేందుకు సిద్ధమైన రైతులు
- February 02, 2020
న్యూ ఢిల్లీ:అమరావతి ఉద్యమం హస్తిన తాకనుంది.. ఇప్పటి వరకు అమరావతిలోనే ఆందోళనలు చేస్తూ తమ నిరసన తెలుపుతున్న రైతులు.. తమ నినాదాన్ని ఢిల్లీలో వినిపించేందుకు సిద్ధమయ్యారు. రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తెలిపేందుకు ఇప్పటికే అమరావతి రైతులు, జేఏసీ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు.
దాదాపు 47 రోజులకు పైగా రాజధాని అంశంపై పోరాటం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ అపాయింట్మెంట్ దొరికితే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులను కలుస్తామని చెప్పారు. రైతుల పోరాటానికి తగిన న్యాయం చేయాలని కోరుతామన్నారు.
రాజధానిలో ఇప్పటి వరకు 30 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయినా రాష్ట్ర ప్రభుత్వం చలించడం లేదని జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. వీలనైంత ఎక్కువ మంది కేంద్రమంత్రులను కలిసి రాజధానిపై స్పష్టమైన హామీ తీసుకున్నాకే ఢిల్లీ నుంచి తిరిగి వెళ్లామంటున్నారు రైతులు.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు