మళ్ళీ షాకిచ్చిన ట్రంప్
- February 02, 2020
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అంటేనే అందరికి గుర్తుకువచ్చేవి ఆయన చేసే వివాదాస్పద వ్యాఖ్యలు, పనులు. ఈ మధ్యకాలంగా ట్రంప్ రోజుకొక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు. మొన్న అభిశంసన ప్రక్రియ విషయంలో, నిన్న WES లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంతో మంది మేధావులని షాక్ కి గురిచేస్తున్నాయి. ఎప్పుడూ ఎంతో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉండే ట్రంప్ తాజాగా మరొక వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు.
ట్రావెల్ బ్యాన్ అంశాన్ని మళ్ళీ ట్రంప్ తెరపైకి తీసుకువచ్చారు. గతంలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన కొత్తలో తాను తీసుకున్న ఇదే ట్రావెల్ బ్యాన్ నిర్ణయం వివదాస్పదంగా మారింది. ఆ తరువాత దానికి కొన్ని సవరణలు చేసి 7 దేశాల వారికి నిషేధాన్ని పరిమితం చేశారు. ఈ ఏడు దేశాలలో ముస్లిం మెజారిటీ ఉన్న దేశాలే ఎక్కువ. అయితే ఇప్పుడు ఈ ప్రయాణ నిషేధాన్ని విస్తరిస్తున్నామని, ఆఫ్రికాలోనే అత్యధిక జనాభా కలిగిన నైజీరియతో పాటు ఏరిట్రియా, సూడాన్, టాంజానియా,కిర్కిజిస్తాన్ మరియూ మయన్మార్ దేశాలను కూడా ఈ నిషేధంలోకి చేర్చామని తెలిపారు...ఇదిలా ఉంటే...
ట్రావెల్ బ్యాన్ కు గురైన దేశాల వారు అమెరికాలో నివశించటానికి వీసాలను పొందలేరు కాని, ఆయా దేశాల విద్యార్ధులకు, పర్యాటకులకు, వ్యాపార ప్రయాణాలకు మాత్రం ట్రావెల్ బ్యాన్ వర్తించదని వైట్ హౌస్ తెలిపింది. అయితే అసలు ఈ నిషేధానికి కారణం ఏంటంటే అమెరికా నిర్దేశించిన కనీస అవసరాలు తీర్చటంలో విఫలమవ్వడమేనని అమెరికా హోంల్యాండ్ పేర్కొంది. ఈ ప్రయాణ నిషేధాన్ని ట్రంప్ మొదటిగా 2017 లో ప్రవేశ పెట్టారు. ఇప్పుడు దాన్ని విస్తరిస్తూ ఈ నిర్ణయాన్ని ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







