'అర్జున్ సురవరం' ప్రేమ వివాహం
- February 02, 2020
హ్యాపీడేస్ చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్. ఈ యువ నటుడు హ్యాపీడేస్ తర్వాత హీరోగా పలు సినిమాలు చేసి మంచి విజయాలు అందుకున్నాడు. ఇటీవలే నిఖిల్ నటించిన అర్జున్ సురవరం మంచి టాక్ తెచ్చుకుంది. కాగా ఇప్పటివరకు సినిమాలతో బిజీబిజీగా గడిపిన నిఖిల్ ఈ ఏడాది పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అవుతున్నాడు. నిఖిల్ తను ప్రేమించిన అమ్మాయిని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. నిఖిల్ భీమవరం అమ్మాయి డాక్టర్ పల్లవివర్మను గోవాలో ప్రపోజ్ చేసి..పెద్దలను ఒప్పించి ఎక్కడైతే ప్రపోజ్ చేశాడో అదే గోవాలో ఫిబ్రవరి 1న నిశ్చితార్థం చేసుకున్నాడు. ఏప్రిల్ 16న నిఖిల్, పల్లవి వర్మల వివాహం జరుగనుంది. నిఖిల్, పల్లవి వర్మను ప్రపోజ్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి వేడుకకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







