న్యూజిలాండ్ పై విజయం.. భారత్ క్లీన్ స్వీప్..
- February 02, 2020
న్యూజిలాండ్ పై జరిగిన ఐదో టీ20 లోను భారత్ విజయం సాధించింది. న్యూజిలాండ్‌పై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. మౌంట్‌మాంగలో జరిగిన ఈ చివరి టీ20లో టీమిండియా 164 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు కేఎల్ రాహుల్(45; 33 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లు), రోహిత్ శర్మ(60 రిటైర్డ్ హర్ట్; 41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో పాటు శ్రేయస్ అయ్యర్(33 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మరోసారి బాధ్యతాయుతంగా ఆడటంతో నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.
అనంతరం బరిలోకి దిగిన కివీస్ జట్టు 20 ఓవర్లలో 156 పరుగులు చేసింది. దీంతో 7 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి చవిచూసింది. టిమ్ సిఫర్ట్(50), రాస్ టేలర్(53) మినహా అందరూ విఫలమయ్యారు. న్యూజిలాండ్ 9 వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో 156 పరుగులు చేసింది. భారత బౌలర్లు బుమ్రా(3), నవదీప్ సైని, శార్ధూల్ ఠాకూర్ లు చెరో రెండు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశాడు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







