గల్ఫ్ కార్మికులకు ప్రవాసీ భీమాతో భరోసా

- February 02, 2020 , by Maagulf
గల్ఫ్ కార్మికులకు ప్రవాసీ భీమాతో భరోసా

తెలంగాణ:ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు  వెళ్తున్న కార్మికులు రూ.10 లక్షల విలువైన "ప్రవాసి భారతీయ భీమా యోజన-2017" అనే ప్రమాద భీమా పాలసీని తప్పకుండా తీసుకోవాలని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు  స్వదేశ్ పరికిపండ్ల  కోరారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో  స్థానిక గల్ఫ్ వాపసీలు ఆదివారం (02.02.2020) నిర్వహించిన గల్ఫ్ వలసలపై అవగాహన కార్యక్రమంలో స్వదేశ్ ముఖ్య అథితిగా పాల్గొన్నారు. 

ఈ సంధర్భంగా కోరుట్లకు చెందిన సీనియర్ న్యాయవాది చెన్న విశ్వనాథం మాట్లాడుతూ చట్టబద్దంగా వలస వెళ్లడం వలన ప్రభుత్వ రక్షణ పొందవచ్చని, హక్కులు సాధించుకోవచ్చని అన్నారు. విజిట్ వీసాలపై అక్రమ  పద్దతిలో విదేశాలకు వెళ్ళకూడదని ఆయన కోరారు. 

నేషనల్ అకాడమి ఆఫ్ కన్ స్ట్రక్షన్ (న్యాక్) కేంద్రాలలో ఉచిత భోజన, వసతి సౌకర్యంతో పాటు కల్పిస్తున్న ఉచిత నైపుణ్య శిక్షణ పొందాలని,  గల్ఫ్ కు సురక్షితంగా వెళ్ళండి..  శిక్షణ పొంది వెళ్ళండి అని గ్రామానికి చెందిన ఓమన్  రిటర్నీ రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన ఖతార్ ప్రవాసీ పారిపెల్లి గణేష్  తదితరులు పాల్గొన్నారు. 

వివిధ దేశాల్లో ఇబ్బందుల్లో ఉన్న భారతీయులు, వారి కుటుంబ సభ్యులు సహాయం, సలహాల కోసం... ఢిల్లీ లోని భారత ప్రభుత్వ టోల్ ఫ్రీ నెం: 1800 11 3090, హైదరాబాద్ లోని క్షేత్రీయ ప్రవాసి సహాయతా కేంద్రం నెం. +91 73067 63482, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ హెల్ప్ లైన్ నెం. +91 94947 60477 కు సంప్రదించాలని ప్రవాసి కార్మిక నాయకుడు దీకొండ కిరణ్ కోరారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com