ఢిల్లీ: బడ్జెట్ లో NRIలకు షాక్..ట్యాక్స్ పాలసీపై కేంద్రం క్లారిటీ

- February 03, 2020 , by Maagulf
ఢిల్లీ:  బడ్జెట్ లో NRIలకు షాక్..ట్యాక్స్ పాలసీపై కేంద్రం క్లారిటీ

ట్యాక్స్ పాలసీలో NRIలకు కేంద్రం షాకిచ్చింది. ఉద్యోగం, వ్యాపారం, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే వారు 182 రోజులు ఫారెన్ కంట్రీస్ లో ఉంటే వారిని NRIలుగా పరిగణించేవారు. కానీ, బడ్జెట్ 2020లో గడువును సవరణించారు. 182 నుంచి 240 రోజులకు పొడగించారు. అంటే ఇకపై 240 రోజులు విదేశాల్లో ఉంటేనే వారిని NRIలుగా పరిగణిస్తారు. అంతకు తక్కువ రోజులు అంటే 125 రోజులు ఇండియాలో ఉన్నా వారిని NRIగా పరిగణించరు. వారికి కూడా సాధారణ ట్యాక్స్ పాలసీ కిందకు వస్తారు.

ఇదిలా ఉంటే అలాగే విదేశాల్లో సంపాదనపైనా పన్ను విధింపుపై గందరగోళం నెలకొనటంతో కేంద్రం NRI ట్యాక్స్ పాలసీపై క్లారిటీ ఇచ్చింది. విదేశాల్లో పన్ను చెల్లించకుంటే..ఇండియాలో ట్యాక్స్ చెల్లించాలని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ కొట్టిపారేశారు. గల్ఫ్ కంట్రీస్ తో పాటు ఇతర దేశాలకు వెళ్లే NRIల సంపాదనపై ఎలాంటి పన్ను ఉండబోదని స్పష్టం చేశారు. అయితే..ఇండియాలో ఉన్న వారి అస్థులపై మాత్రం పన్ను విధిస్తామని క్లారిటీ ఇచ్చారు. స్థిర ఆస్తులపై వచ్చే అద్దెతో పాటు ఇండియాలో ఇతర వ్యాపారాలు, ఆదాయ మార్గాలు ఉన్నా పన్ను చెల్లించాల్సిందేనని ఆమె అన్నారు. అయితే..NRIలుగా పరగిణించే గడువును 182 నుంచి 240లకు పెంచటంపై మాత్రం ప్రవాసీయుల్లో అసంతృప్తి నెలకొని ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com