ఇయర్ ఆఫ్ టోలరెన్స్: దుబాయ్ పోలీస్ అందిస్తున్న బంపర్ ఆఫర్

- February 04, 2020 , by Maagulf
ఇయర్ ఆఫ్ టోలరెన్స్: దుబాయ్ పోలీస్ అందిస్తున్న బంపర్ ఆఫర్

దుబాయ్‌:దుబాయ్‌ పోలీస్‌, వాహనదారులకు గుడ్‌ న్యూస్‌ అందించారు. ఇయర్‌ ఆఫ్‌ టోలరెన్స్‌ ఫిబ్రవరి 6న ముగుస్తున్న కారణంగా  100 శాతం ట్రాఫిక్‌ ఫైన్స్‌పై రిడక్షన్‌ పొందేందుకు వీలుంది. గత 12 నెలల్లో ఉల్లంఘనలకు పాల్పడినవారికి ఉపశమనం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తొలి డిస్కౌంట్‌ని 25 శాతంగా నిర్ణయించారు. మే నెలలో దీన్ని జారీ చేస్తారు. ఆరు నెలలపాటు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా వుంటే 50 శాతం డిస్కౌంట్‌ పొందవచ్చు. నవంబర్‌ వరకు ఉల్లంఘనలకు పాల్పడని పక్షంలో 75 శాతం, 2020 జనవరి వరకు ఉల్లంఘనల జోలికి వెళ్ళకపోతే 100 శాతం ఉపశమనం పొందడానికి వీలు కల్పించారు. క్రమశిక్షణ గల డ్రైవర్లకు ఆఖరి తేదీ అయినటువంటి 06/02/2020 న జరిమానాలపై 100% డిస్కౌంట్ లభిస్తుంది.

ఒకవేళ డ్రైవర్‌కు మునుపటి జరిమానాలపై డిస్కౌంట్ లభించి, కొత్త జరిమానా విధింపబడినట్లైతే, జరిమానా తగ్గింపు అతనికి వర్తించదు.  అనగా మునుపటి జరిమానాల పై తగ్గిన మొత్తం పెరగదు కాని కొత్త జరిమానాలపై అతనికి మరింత డిస్కౌంట్ లభించదు.

గమనిక: - జరిమానాలపై డిస్కౌంట్ అనేది వ్యక్తిగత పేరు మీద రిజిస్టర్ చేయబడిన వాహనాలకు మాత్రమే వర్తిస్తుందనీ, కంపెనీ లేదా ట్రాన్స్పోర్ట్ లో నమోదు చేసిన వాహనాలకు వర్తించదని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com