ఇయర్ ఆఫ్ టోలరెన్స్: దుబాయ్ పోలీస్ అందిస్తున్న బంపర్ ఆఫర్
- February 04, 2020
దుబాయ్:దుబాయ్ పోలీస్, వాహనదారులకు గుడ్ న్యూస్ అందించారు. ఇయర్ ఆఫ్ టోలరెన్స్ ఫిబ్రవరి 6న ముగుస్తున్న కారణంగా 100 శాతం ట్రాఫిక్ ఫైన్స్‌పై రిడక్షన్ పొందేందుకు వీలుంది. గత 12 నెలల్లో ఉల్లంఘనలకు పాల్పడినవారికి ఉపశమనం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తొలి డిస్కౌంట్ని 25 శాతంగా నిర్ణయించారు. మే నెలలో దీన్ని జారీ చేస్తారు. ఆరు నెలలపాటు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా వుంటే 50 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. నవంబర్ వరకు ఉల్లంఘనలకు పాల్పడని పక్షంలో 75 శాతం, 2020 జనవరి వరకు ఉల్లంఘనల జోలికి వెళ్ళకపోతే 100 శాతం ఉపశమనం పొందడానికి వీలు కల్పించారు. క్రమశిక్షణ గల డ్రైవర్లకు ఆఖరి తేదీ అయినటువంటి 06/02/2020 న జరిమానాలపై 100% డిస్కౌంట్ లభిస్తుంది.
ఒకవేళ డ్రైవర్‌కు మునుపటి జరిమానాలపై డిస్కౌంట్ లభించి, కొత్త జరిమానా విధింపబడినట్లైతే, జరిమానా తగ్గింపు అతనికి వర్తించదు. అనగా మునుపటి జరిమానాల పై తగ్గిన మొత్తం పెరగదు కాని కొత్త జరిమానాలపై అతనికి మరింత డిస్కౌంట్ లభించదు.
గమనిక: - జరిమానాలపై డిస్కౌంట్ అనేది వ్యక్తిగత పేరు మీద రిజిస్టర్ చేయబడిన వాహనాలకు మాత్రమే వర్తిస్తుందనీ, కంపెనీ లేదా ట్రాన్స్పోర్ట్ లో నమోదు చేసిన వాహనాలకు వర్తించదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!