మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ గా అఖిల్.!

- February 05, 2020 , by Maagulf
మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ గా అఖిల్.!

అఖిల్‌ అక్కినేని సినిమాకు 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' టైటిల్‌ ఖరారు చేశారు. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకుడు. బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. కథకు తగినట్టుగా టైటిల్‌ నిర్ణయిం చినట్టు నిర్మాతలు వెల్లడించారు. ఈ సినిమా యూత్‌ని అలరించడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌ని సైతం ఆకట్టుకుంటుం దన్నారు. అఖిల్‌ అక్కినేనికి ఇది నాలుగవ చిత్రం. ఇతర పాత్రల్లో ఆమని, మురళిశర్మ, జయప్రకాశ్‌, ప్రగతి, సుడిగాలి సుధీర్‌, గెటప్‌ శ్రీను తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం గోపీసుందర్‌, ఛాయాగ్రహణం ప్రదీశ్‌ ఎమ్‌ వర్మ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com