కన్నుమూసిన ఎన్టీఆర్ అభిమాని శ్రీనిధి..
- May 19, 2015
క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నారి శ్రీనిధి(10) మృతి చెందింది. శ్రీనిధి స్వస్థలం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బందనపల్లి. జూనియర్ ఎన్టీఆర్ను చూడాలన్న శ్రీనిధి కోరిక మేరకు... ఇటీల జూనియర్ ఎన్టీఆర్ ఆసుపత్రికివెళ్లి శ్రీనిధిని పరామర్శించిన విషయం తెలిసిందే. మంగళవారం అర్థరాత్రి కూకట్ పల్లి రామ్ దేవ్ రావ్ ఆస్పత్రిలో చిన్నారి శ్రీనిధి కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నారి భౌతికకాయాన్ని ఆదివారం అర్ధరాత్రి సమయంలో రామ్ దేవ్ రావ్ ఆస్పత్రి నుంచి స్వస్థలమైన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బంధనపల్లికి తరలించారు. శ్రీనిధి గత రెండున్నర సంవత్సరాలుగా బ్లడ్ కేన్సర్ తో బాధపడిన విషయం తెలిసిందే. గతంలో జూనియర్ ఎన్టీఆర్ ను చూడాలని శ్రీనిధి కోరడంతో చిన్నారి కోరిక మీదట కూకట్ పల్లి రామ్ దేవ్ రావ్ ఆస్పత్రిలో జూనియర్ ఎన్టీఆర్ పరామర్శించిన విషయం అందరికి తెలిసిందే. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బంధనపల్లికి చెందిన శివాజీ, క్రాంతికుమారిలకు ముగ్గురు ఆడపిల్లలు ఉండగా, వాళ్లలో శ్రీనిధి పెద్దకుమార్తె. ఆమెకు ఆరాధ్య, అలేఖ్య అనే ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. శ్రీనిధికి ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం. ఆయన నటించిన యమదొంగ సినిమా ఆమెకు బాగా గుర్తు. ఎన్టీఆర్ తనను చూసేందుకు వచ్చినప్పుడు కూడా యమదొంగ సినిమా గురించి ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించింది. తాను చిన్నారి శ్రీనిధి బాధను తీర్చలేకపోయినా.. కనీసం తనను చూడాలన్న ఆమె చివరి కోరికనైనా తీర్చగలిగానని ఎన్టీఆర్ ఆరోజు ఎంతగానో బాధపడ్డారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







