థాయ్‌లాండ్‌లో సైనికుడి కాల్పులు,20 మంది మృతి

- February 08, 2020 , by Maagulf
థాయ్‌లాండ్‌లో సైనికుడి కాల్పులు,20 మంది మృతి

థాయ్‌లాండ్‌:థాయ్‌లాండ్‌లోని నఖోన్ రట్చసీమా(కోరాట్) నగరంలో ఒక థాయ్ సైనికుడు జరిపిన కాల్పుల్లో 20 మంది మృతి చెందారని పోలీసులు తెలిపారు.
జక్రఫంత్ థోమా అనే ఒక జూనియర్ ఆఫీసర్ మిలిటరీ క్యాంప్ నుంచి తుపాకీ, బుల్లెట్లు దొంగిలించి తన కమాండింగ్ ఆఫీసర్‌పై దాడి చేశారని ఆయన చెప్పారు.

అనుమానితుడు ఇప్పటికీ షాపింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లోనే దాక్కుని ఉన్నట్టు ఆయన చెప్పారు.అనుమానితుడిని పట్టుకోడానికి అధికారులు సెంటర్‌ను అన్నివైపుల నుంచీ మూసేశారు. చుట్టుపక్కల వారు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

దాడి జరుగుతున్న సమయంలో అనుమానితుడు తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో "నేను లొంగిపోవచ్చా" అని పోస్ట్ చేశాడు.అంతకు ముందు అతడు ఒక పిస్టల్, మూడు సెట్ల బుల్లెట్లు ఉన్న ఫొటోలను పోస్ట్ చేశాడు. దానితోపాటూ "ఇది ఉత్సాహపడాల్సిన సమయం" అని రాశాడు.

స్థానిక మీడియా చూపిస్తున్న దృశ్యాల్లో మువాంగ్ జిల్లాలోని ఒక షాపింగ్ సెంటర్ టెర్మినల్ 21లో కారు దిగిన అనుమానితుడు, భయంతో పారిపోతున్న జనాలపై కాల్పులు జరపడం కనిపిస్తోంది.

మరో ఫుటేజిలో భవనం బయట మంటలు కనిపిస్తున్నాయి. మీడియా కథనాల ప్రకారం ఈ దాడిలో 12 మంది వరకూ మృతిచెందారు.సోషల్ మీడియాలో జనం పోస్ట్ చేస్తున్న ఒక వీడియోలో షాపింగ్ సెంటర్ దగ్గర జరుగుతున్న కాల్పులు కనిపిస్తున్నాయి. ఇది ఇప్పటికీ కొనసాగుతున్నట్టు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com