హీరో విజయ్‌కు ఐటీ నోటీసులు..తమిళనాట పెరుగుతున్న హీట్
- February 10, 2020
చెన్నై: తమిళనాడులో సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఇటీవల ఆదాయ పన్ను శాఖ జరిపిన సోదాలు తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. స్టార్ హీరో విజయ్ ఇంటిపై ఐటీ దాడులు మరింత హీట్‌ను పెంచాయి. కక్షతోనే బీజేపీ ఆదాయపన్ను శాఖతో దాడులు చేయిస్తోందని విమర్శలు వచ్చాయి. కాగా, ఐటీ అధికారులు ఈ రోజు మరో అడుగు ముందుకేశారు. పన్నును ఎగ్గొట్టారన్న ఆరోపణలపై ఆయనకు సమన్లు జారీ చేశారు. తమిళనాడుకు చెందిన ప్రముఖ నిర్మాత అన్బు చెజియాన్ పన్ను ఎగవేత కేసులోనూ విజయ్ జోక్యం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంపైనే తమకు సమాధానం చెప్పాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. కాగా హీరో విజయ్ నటించిన మెర్శల్ చిత్రంలో పలు అంశాలు బిజెపిని టార్గెట్ చేసినట్లు ఉన్నాయని అప్పట్లో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రజలకు ప్రభుత్వం ఉచిత వైద్యం అందించకపోవడం, జీఎస్‌టీ వసూళ్లు వంటి సన్నివేశాలు బిజెపి నేతలను ఆగ్రహానికి గురి చేశాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







