'అజాద్ కశ్మీర్' కు ఒలంపిక్స్‌ లో కష్టాలు

- February 10, 2020 , by Maagulf
'అజాద్ కశ్మీర్' కు ఒలంపిక్స్‌ లో కష్టాలు

ఉస్మాన్ ఖాన్.. ఈక్వెస్ట్రియన్ (హార్స్ రైడర్) ఆటగాడు. టోక్యోలోని ఒలంపిక్ ఈక్వెస్ట్రియన్ చాంపియన్ షిప్‌కు అర్హత సాధించిన తొలి పాకిస్థానీ హార్స్ రైడర్. అయితే ఇతడు ఒలంపిక్స్ వరకు వెళ్లగలడా లేదా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. అతడు తన గుర్రానికి పెట్టిన పేరు అసలు కారణం.. ఆ గుర్రం పేరు 'ఆజాద్ కశ్మీర్' అని పెట్టడమే అతన్ని చిక్కుల్లో పడేసింది. భారతీయ ఒలంపిక్స్ అధికారులు ఈ పేరు విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ లీగల్ అడ్వైజ్ కోరుతున్నారు.

ఉస్మాన్ తన గుర్రానికి పెట్టిన పేరు అభ్యంతరకరంగా ఉందని అన్నారు. ఒలంపిక్స్ వేదిక వద్ద ఏదైనా రాజకీయ ప్రకటనలు, ఒలంపిక్ చార్టర్ బార్స్ పొలిటిక్స్, మతం లేదా జాతి వివక్షతో వంటి రాజకీయలకు దూరంగా ఉండాలని అంతర్జాతీయ ఒలంపిక్ కమ్యూనిటీ స్పష్టం చేసింది. కానీ, ఉస్మాన్ ఖాన్ రైడింగ్ చేసే గుర్రానికి అజాద్ కశ్మీర్ అనే పేరును పెట్టుకోవడాన్ని తీవ్ర అభ్యంతర వ్యక్తం చేస్తోంది.

ఉస్మాన్ (38) ఆస్ట్రేలియా ఆధారంగా ఏప్రిల్ 2019లో తన గుర్రానికి ఈ పేరు పెట్టుకున్నాడు. కశ్మీర్ లో ఆందోళనలు మొదలు కాక ముందే ఉస్మాన్ తన గుర్రానికి ఈ పేరును పెట్టాడు. వాస్తవానికి ఈ గుర్రం అసలు పేరు.. Here to Say గా పిలుస్తుండగా.. ఉస్మాన్ తన గుర్రం పేరులోని ఒక లైన్ ఇతర గుర్రాల్లోని ప్రాంతాల పేర్ల మాదిరిగా మార్చేశాడు.

ఉస్మాన్.. 2014లో ఈక్వెస్ట్రియన్ హార్స్ రైడర్ గా అర్హత సాధించాడు. 2018లో ఆసియన్ గేమ్స్ ఆడేందుకు తనకు తన గుర్రానికి నిధులు సమకూరేవి కావు. అయినప్పటికీ ఉస్మాన్ హార్స్ రైడర్ గా తనకున్న నైపుణ్యంతో ఒలంపిక్ ఈక్వెస్ట్రియన్ చాంపియన్ షిప్‌కు అర్హత సాధించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com