యూఏఈ:6 స్టోర్స్ బిల్డింగ్ లో ఫైర్ యాక్సిడెంట్..ఐదుగురికి గాయాలు
- February 11, 2020
యూఏఈ:ఆరు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగటంతో ఐదురుగురు గాయపడ్డారు. ఉమ్ అల్ క్వాయిన్ యొక్క అల్ రామ్లా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిప్రమాదం ఇన్ఫర్మేషన్ అందగానే సివిల్ డిఫెన్స్ అధికారులు వెంటనే స్పందించారు. ఘటన స్థలానికి వెంటనే ఫైర్ ఫైటర్స్ టీంతో పాటు పారామెడిక్స్ ని పంపించారు. మంటలు మరింత విస్తరించకుండా ఫైర్ ఫటర్స్ మంటలను అదుపు చేశారు. అలాగే నేషనల్ అంబులెన్స్ కమ్యూనికేషన్స్ సెంటర్ వెంటనే ఎనిమిది ఆంబులెన్స్ లతో పాటు ఇద్దరు ఫస్ట్ రెస్పాండర్స్ ను ఘటన స్థలానికి పంపింది. ప్రమాదంలో గాయపడిన వారికి ప్రధమచికిత్స అందించి వెంటనే సమీపంలోని షేక్ కలీఫా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురికి తీవ్రగాయాలు అవగా..మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం