అహం బ్రహ్మాస్మి మార్చి 6న ప్రారంభం
- February 13, 2020
హీరో మంచు మనోజ్ అదిరిపోయే రీతిలో వెండితెరపై కనిపించేందుకు మళ్లీ వస్తున్నారు. లేటెస్టుగా 'అహం బ్రహ్మాస్మి' అనే మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీకాంత్ ఎన్. రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ ఫిల్మ్ టైటిల్ లోగోను కూడా విడుదల చేశారు. టైటిల్ తరహాలోనే, పోస్టర్ సైతం ఉత్తేజభరితంగా ఉంది. అందులో ఒక దైవత్వం కనిపిస్తోంది.
మార్చి 6న గ్రాండ్ లెవల్లో లాంచ్ అవుతున్న 'అహం బ్రహ్మాస్మి'ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.ఎంఎం ఆర్ట్స్ బ్యానర్ పై మంచు మనోజ్, నిర్మలాదేవి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని విద్యా నిర్వాణ, మంచు ఆనంద్ సమర్పిస్తున్నారు.
ఈ సినిమాని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అనౌన్స్ చేసిన మనోజ్, "మూడేళ్ల తర్వాత మీ దగ్గరకు వస్తున్నాను. నా తొలి చిత్రం 'దొంగ దొంగది' సమయంలో ఎలాంటి ఉద్వేగాన్ని ఫీల్ అయ్యానో ఇప్పుడూ అదే భావోద్వేగంతో ఉన్నా. ఈ జర్నీ మొత్తం తెరపైనా, తెర బయటా మీరు నాపై చూపించిన ప్రేమకూ, మీరిచ్చిన సపోర్టుకూ థాంక్స్. నా లైఫ్ అయిన నా కళ (ఆర్ట్)ను నేను మిస్సయ్యాను. సినీ అమ్మ.. వచ్చేశా. లవ్ యు ఆల్ డార్లింగ్స్.. 'అహం బ్రహ్మాస్మి'.." అని ట్వీట్ చేశారు.త్వరలోనే 'అహం బ్రహ్మాస్మి'కి సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర బృందం వెల్లడించనున్నది
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!