ఏపి,తెలంగాణ రాష్ట్రాల ఐటీ దాడుల్లో రూ.2000 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు...
- February 13, 2020
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరిపిన ఆదాయపన్ను శాఖ దాడుల్లో రూ.2000 కోట్ల విలువైన ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించినట్టు ఐటీ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరిపిన ఆదాయపన్ను శాఖ దాడుల్లో రూ.2000 కోట్ల విలువైన ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించినట్టు ఐటీ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. '2020 సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఆదాయ పన్ను శాఖ హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్నం, ఢిల్లీ, పుణెల్లో సోదాలు జరిపింది. మొత్తం 40 చోట్ల ఐటీ సోదాలు జరిగాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని మూడు ప్రముఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు ఉన్నాయి. అధిక బిల్లులు, బోగస్ బిల్లులతో బోగస్ సబ్ కాంట్రాక్టుల ద్వారా భారీ ఎత్తున నగదు లావాదేవీలు జరిపిన రాకెట్ గుట్టు రట్టయింది. ఓ ప్రముఖుడికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి మీద కూడా ఐటీ దాడులు జరిగాయి. ఆ పర్సన్‌కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు లభ్యమయ్యాయి.' అని ఆ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!