భారతీయులకు ఇది బ్లాక్ డే
- February 14, 2020
ఫిబ్రవరి 14 అంటే అందరికి గుర్తుకు వచ్చేది ప్రేమికుల రోజు. ప్రపంచం మొత్తం ఈ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటుంది. ఇండియాలో కూడా దీనిని ప్రేమికులు ఓ వేడుకలా జరుపుకుంటారు. అయితే, ఏడాది క్రితం జమ్ము-కశ్మీర్‌లోని పుల్వామాలో 40 మంది సైనికులు వీరమరణం పొందిన రోజు కూడా ఇదే.. పక్కా వ్యూహాలతో పాకిస్తాన్ ఉగ్రవాదులు పన్నిన కుట్రలో మన సైనికులను కోల్పోయిన రోజు.. 2019 ఫిబ్రవరి 14న జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా (అవంతిపురా సమీపంలో) కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది.
ఈ దాడిలో 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్ సైనికులు, ఒక ఉగ్రవాది మరణించారు. పాకిస్తాన్‌లోని ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ ఈ దాడి చేసినట్లుగా ప్రకటించింది. దాడిచేసినది కాశ్మీరీ అయిన ఆదిల్ అహ్మద్ దార్గా గుర్తించారు. ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న ఆ ఉగ్రవాది కూడా హతమయ్యాడు. పక్కా వ్యూహంతో ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్టు దర్యాప్తులో వెల్లడైంది.
దీంతో భారత్ ప్రతీకారంతో రగిలిపోయింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాలని భావించింది. సర్జికల్ స్ట్రయిక్స్ చేసి ఫిబ్రవరి 26 తెల్లవారుజామున పాకిస్తాన్ భూభాగంలో బాలాకోట్‌లోని జైషే మొహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. ఈ ఎయిర్ స్ట్రయిక్స్‌లో 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
అయితే పుల్వామా దాడి జరిగిన ఈరోజును భారత్ మొత్తం బ్లాక్ డే గా పరిగణించారు. ఇవాళ మధ్యాహ్నం 3గంటల 15 నిమిషాలకు పుల్వామాలో భారత సైనికుల మీద జరిగిన దాడిని ఖండిస్తూ భారతదేశంలో 2 నిమిషాల పాటు మౌనం పాటించి మన అమర_జవాన్లకు నివాళులు అర్పించాలంటూ మెసేజ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!