దోహ: కొత్త హంగులతో అల్ ఖోర్ ఫ్యామిలి పార్క్ రెడీ..సండే నుంచి రీఓపెన్

దోహ: కొత్త హంగులతో అల్ ఖోర్ ఫ్యామిలి పార్క్ రెడీ..సండే నుంచి రీఓపెన్

దోహాలో అల్ ఖోర్ ఫ్యామిలి పార్క్  కొత్త హంగులతో సిద్దమైంది. దాదాపు 100 రోజుల తర్వాత ఈ పార్క్ మళ్లీ ఈ ఆదివారం నుంచి ఓపెన్ అవుతోంది. దాదాపు QR32m ఖర్చుతో మినిస్ట్రి ఆఫ్ మున్సిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ అధికారులు పార్క్ ను రినోవేట్ చేశారు. పార్క్ లో మ్యూజియమ్, ఓపెన్ థియేటర్ తో పాటు పలు రకాల జంతువులు, పక్షలు విజిటర్స్ ను అలరించనున్నాయి. పార్క్ లో ఎంట్రీ ఫీజును పెద్దలకు QR15, పదేళ్లలోపు పిల్లలకు QR10లుగా నిర్ణయించారు. ఒక్క ఏడాదిలో 5 లక్షల మంది విజిటర్స్ వస్తారని మినిస్ట్రి అంచనా వేస్తోంది. పోయినేడాది అక్టోబర్ 22 నుంచి గత జనవరి 29 వరకు పార్క్ లో రినోవేటెడ్ వర్క్స్ జరిగాయి. ఖతార్ లోనే అతిపెద్దదైన ఈ అల్ ఖోర్ పార్క్ ను విజిటర్స్ సేఫ్టికి అధిక ప్రధాన్యం ఇస్తూ జూని మరింత విస్తరించారు. అలాగే పార్క్ లో 400 ఆడియన్స్ కెపాసిటీ ఉండేలా ఓ రోమన్ థియేటర్ తో పాటు మ్యూజియమ్, రెస్టారెంట్, కెఫెటేరిస్, ఫౌంటేన్స్ ఉన్నాయి. అలాగే రెండు చిల్డ్రన్ ప్లే ఏరియాస్ తో పాటు 360 మంది భక్తులకు సరిపడా మసీదును నిర్మించారు.

 

Back to Top