అంటార్కిటికాలో డేంజర్ బెల్స్..గతంలో ఎన్నడూ లేనంతగా టెంపరేచర్స్

అంటార్కిటికాలో డేంజర్ బెల్స్..గతంలో ఎన్నడూ లేనంతగా టెంపరేచర్స్

రోజురోజుకి పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్ అంటార్కిటికాలో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. భూమ్మీద అత్యంత శీతల ప్రాంతమైన అంటార్కిటికాలో రికార్డ్ స్థాయి టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. తొలిసారి ఏకంగా 20.75 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు సైంటిస్టులు ప్రకటించారు. ఇప్పటివరకు ఇక్కడ నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 19 డిగ్రీలు. అయితే..పాత రికార్డును బ్రేక్ చేస్తూ ఈ సీజన్ లో  మరో డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ పెరిగిందని సైంటిస్టులు వివరించారు. అంటార్కిటికా ఉత్తరాగ్ర భాగంలో ఉన్న సైమోర్ ద్వీపంలో ఈ రికార్డ్ టెంపరేచర్స్ నమోదైంది. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులే ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమని స్పష్టంగా చెప్పలేమని సైంటిస్టులు అంటున్నా...అత్యంత శీతల ప్రాంతంలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

 

Back to Top