అబుదాబి: ఫస్ట్ ఈవెంట్ ఆతిథ్యం ఇవ్వనున్న ఎతిహాద్ ఎరినా
- February 14, 2020
అబుదాబి మిడ్ ఏప్రిల్ లో ఫస్ట్ ఈవెంట్ కు రెడీ అయ్యింది. మల్టి పర్పస్ ఇండోర్ వెన్యూ ఎతిహాద్ ఎరినా ఇందుకు ఆతిథ్యం ఇవ్వనుంది మిరాల్ ప్రకటించింది. అబేదాబి ల్యాండ్ మార్క్ వెన్యూ ఎతిహాద్ ఎరినాలో ఈ ఏడాది నిర్వహించబోతున్న తొలి ఈవెంట్ కోసం ఎక్సైట్మెంట్ గా ఎదురుచూస్తున్నామని మిరాల్ చైర్మన్ మొహమ్మద్ ఖలీఫా అల్ ముబారక్ వెల్లడించారు. ఎతిహాద్ ఎరినా యూఏఈలో కొత్త హబ్ గా అవతరించబోతుందన్నారు. ఇది యస్ ఐలాండ్స్ విజన్, ఎంటర్టైన్మెంట్ కు ఇది గ్లోబల్ డెస్టినేషన్ గా మారుతుందన్నారు. యూఈఏ ఎకానమీ విస్తరణలోనూ ఇది కీలకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. 200 నుంచి 18 వేల వరకు ఆడియన్స్ కెపాసిటీతో నిర్మించిన ఎతిహాద్ ఎరినా ఒక్కసారి ప్రజలకు అందుబాటులోకి రాగానే లైవ్ ఎంటర్టైన్మెంట్ కు ల్యాండ్ మార్క్ గా అవుతుందని మొహమ్మద్ ఖలీఫా అల్ ముబారఖ్ వెల్లడించారు. వరల్డ్ క్లాస్ స్పోర్టింగ్ కాంపిటీషన్స్ దగ్గర్నుంచి మ్యూజికల్ షోస్, ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్ తో పాటు యస్ ఐలాండ్స్ ఎంటర్టైన్మెంట్ ను ఎలివేట్ చేసేందుకు ఎంతగానో దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే అబుదాబి టూరిజమ్ డెవలప్మెంట్ లోనూ కీలక మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?