తెలంగాణ రానున్న 16 మంది గల్ఫ్ బాధితులు
- February 14, 2020
హైదరాబాద్:ఇరాక్ లో చిక్కుకున్న 16 మంది తెలంగాణ బిడ్డలను సొంత ప్రాంతానికి రప్పించేందుకు మంత్రి కే. తారకరామారావు చూపిన చొరవ ఫలించింది. ఇరాక్ లో చిక్కుకొని అనేక బాధలు పడుతున్నామని, నకిలీ ఏజెంట్ల మోసంతో ఆక్కడ చిక్కుకొని కనీసం తాగేందుకు నీరు, తినేందుకు తిండి, వసతి సౌకర్యాలు లేక సొంత ప్రాంతాలకు తిరిగి రాలేక నాలుగు సంవత్సరాలుగా నరక యాతన అనుభవిస్తున్నామని మంత్రి కేటీఆర్ కు తెలిపారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్, తెలంగాణ ఎన్నారై శాఖ అధికారులకు సమాచారం అందించి, వారిని సొంత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలు అందించాలని సూచించారు. ఈ మేరకు ఇరాక్లోని భారత రాయబార కార్యాలయం తో, భారత విదేశాంగ శాఖ అధికారులతో సమన్వయం చేసిన తెలంగాణ ఎన్ఆర్ఐ శాఖ, అక్కడ ఇరాక్ లో చిక్కుకున్న వారికి విమాన టికెట్లు అందించి తెలంగాణకు రప్పిస్తుంది. ఈ రోజు ఇరాక్ నుంచి బయలుదేరిన వీరంతా రేపు ఉదయం హైదరాబాద్ కి చేరుకుంటారు. వీరందరిని వారి వారి సొంత ప్రాంతాలకు పంపేందుకు అవసరమైన స్థానిక రవాణా సౌకర్యాలను కూడా తెలంగాణ ఎన్ఆర్ఐ శాఖ సమకూర్చినది. ఆపత్కాలంలో తమ బాధలకు స్పందించి వెంటనే సహాయం అందించిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా మంత్రి కేటీఆర్ కి వారంతా ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయంలో వేగంగా స్పందించిన తెలంగాణ ఎన్ఆర్ఐ శాఖ అధికారి చిట్టి బాబు ని మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







