14 మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల
- February 14, 2020
రాయల్ పిక్చర్స్ పతాకంపై నోయెల్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం `14`. లక్ష్మిశ్రీనివాస్ దర్శకత్వంలో సుబ్బారావ్ రాయన, శివకృష్ణ నిచ్చెన మెట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. వైవిద్యభరితమైన ఈ చిత్రంలో రతన్, విశాఖ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ ఆచార్య, మహేష్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 14 వేలెంటైన్స్ డే కానుకగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని బిగ్ బాస్ విన్నర్ `రాహుల్ సిప్లిగంజ్` విడుదల చేశారు. ఈ సందర్భంగా రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ... “ఈ మోషన్ పోస్టర్ చాలా కొత్తగా ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంది. ఈ పోస్టర్ లాగే సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది అనుకుంటున్నాను. నోయల్ కి `కుమారి 21ఎఫ్` సినిమాకన్నా ఎక్కువ పేరు రావాలని ఆశిస్తున్నాను. టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్`` అన్నారు.
దర్శకుడు లక్ష్మిశ్రీనివాస్ మాట్లాడుతూ - “కొత్త పాయింట్ ని ఎప్పుడు తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకంతో మీ ముందుకు వస్తున్నాం. తప్పకుండా మా చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది`` అన్నారు.
నోయెల్ సీన్, రతన్, వైశాఖ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ ఆచార్య, మహేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయినాథ్, సంగీతం: ఎర్త్ సౌండ్స్, ఎడిటర్: జానకిరామ, స్టంట్స్: డ్రాగన్ ప్రకాష్, మాటలు: ఆదిత్య భార్గవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కామిరెడ్డి బాబురెడ్డి, నిర్మాతలు: సుబ్బారావ్ రాయన, శివకృష్ణ నిచ్చెన మెట్ల, రచన- దర్శకత్వం : లక్ష్మిశ్రీనివాస్.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







