సైబరాబాద్ మహిళా పోలీస్ సిబ్బందికి రెండవ విడత ఉచిత హెల్త్ చెకప్
- February 15, 2020
సైబరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్ సూచన మేరకు సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు, మరియు పోలీస్ కమీషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బందికి ఈరోజు ఉచిత హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ (W&CSW) డీసీపీ అనసూయ ప్రారంభించారు. ఈ హెల్త్ క్యాంప్ లో యశోదా హాస్పిటల్స్, FMS డెంటల్ హాస్పిటల్, Dr. Eye Agarwal హాస్పిటల్స్ పాల్గొన్నారు. వీరిచే బీపీ, షుగర్, ECG, Ultrasound, pap smear, Dental check-up etc., వివిధ పరీక్షలు నిర్వహించారు. రేడియలజిస్ట్, ఆంకాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్, డెంటల్ చెకప్, కంటి పరీక్షల డాక్టర్లుతో కన్సల్టేషన్ ఏర్పాటు చేశారు. ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ఆరోగ్య భద్రత ద్వారా చికిత్సలు చేసుకోవచ్చని డాక్టర్లు సూచించారు. ఈ సందర్భంగా డీసీపీ అనసూయ మాట్లాడుతూ.. ప్రజల వద్దకే పాలన లా, సిబ్బంది పనిచేసే చోటే ఆరోగ్య పరీక్షలు ఏర్పాటు చేసి నూతన ఒరవడికి నాంది పలికిన సైబరాబాద్ సీపీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. సిబ్బంది పని చేసే స్థలంలోనే ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం ద్వారా వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆరోగ్య భద్రత ద్వారా చికిత్సలు చేసుకోవడానికి వీలుందన్నారు. సిబ్బంది ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, తరచూ రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని తగిన వైద్యం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ అనసూయ, అడిషనల్ డీసీపీ క్రైమ్స్-I కవిత, అడిషనల్ డీసీపీ క్రైమ్స్ II టీ. ఇందిర, అడిషనల్ డీసీపీ అడ్మిన్ లావణ్య ఎన్జెపీ , మహిళ పోలీస్ అధికారులు, డాక్టర్ రమ్య, డాక్టర్ శైలజా, డాక్టర్ సుష్మ, డాక్టర్ చైతన్య, డాక్టర్ ఫాతిమా, సీటీసీ డాక్టర్ సుకుమార్ & సీటీసీ డాక్టర్ సరిత, తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







