కువైట్:60 దాటిన ప్రవాసీయులకు రెసిడెన్సీ రెన్యూవల్ క్యాన్సిల్
- February 16, 2020
కువైట్:దేశంలో వలస కార్మికుల సంఖ్యను కుదించటంతో పాటు డెమోగ్రాఫిక్ ఇంబాల్స్ ను గాడిలో పెట్టేలా కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక నుంచి 60 ఏళ్లు దాటిన ప్రవాసీయులకు వర్క్ పర్మిట్, రెసిడెన్సీ రెన్యూవల్ చేయకూడదని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ నిర్ణయించింది. అయితే..ఈ నిర్ణయం కింది స్థాయి కార్మికులకే పరమితం చేయనుంది. దీంతో లేబర్ మార్కెట్ పై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా క్లరికల్ స్టాఫ్, కంపెనీ రిప్రజెంటీవ్స్, డ్రైవింగ్ రంగాల్లో ఉన్న ప్రవాసీయుల వయస్సు 60 ఏళ్లు దాటితే వారికి ఇక నుంచి వర్క్ పర్మిట్ ఇవ్వరు. అయితే..హై ఎడ్యూకేషనల్ డ్రిగ్రీస్ బేస్డ్ ఉద్యోగులపై కువైట్ ప్రభుత్వ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపబోదు. డాక్టర్స్, జర్నలిస్ట్స్, లీగల్ కన్సల్ట్స్, స్పెషలిస్ట్స్, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్స్, ప్రైవేట్ కంపెనీ పార్ట్ నర్స్ కు మాత్రం వయస్సుతో నిమిత్తం సంబంధం లేకుండా రెసిడెన్సీ రెన్యూవల్ యధావిధిగా చేయనున్నారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







