టీ కప్పు నుంచి 200 పరికరాలు..అతడు శిలతో అద్భుతాలు చేశాడు

- February 16, 2020 , by Maagulf
టీ కప్పు నుంచి 200 పరికరాలు..అతడు శిలతో అద్భుతాలు చేశాడు

సౌదీ అరేబియా:తాగే టీ కప్పు నుంచి పెద్ద గంగాళం వరకు అన్ని శిలతోనే. పెద్ద బండరాళ్లను చిన్న చిన్న పరికరాలుగా మల్చుతాడు. సాసర్, కప్పు, టీ ఫ్లాస్కు ఇలా ఇంట్లో వాడే 200 పరికరాల వరకు అద్భుతంగా రూపొందించి ఉలితో అద్భుతాలను చేశాడు. అతని పేరు జోబ్రన్ సలీమ్. యెమన్, కింగ్ డమ్ సరిహద్దు ప్రాంతంలో అతని స్వగ్రామం ఉంది. అతని చేతిలో పడిన ఏ బండరాయి అయినా సరే ఒక పరికరంగా రూపుదిద్దుకుంటుంది. అతని అద్భుత పనితనానికి ఆ పరికరాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

సల్మాన్ ఇంత సుందరమైన పరికరాలను చెక్కేందుకు ఎంతగానో ప్రయాసపడాల్సి వస్తోంది. చెక్కేందుకు అనుకూలంగా ఉండే శిలను గుర్తించి దాన్ని వెలికితీయటమూ కష్టమే.
పర్వతాల నుండి రాయిని తీయడానికి ఉక్కుతో తయారు చేసిన ఆదిమ సాధనాలను ఉపయోగిస్తున్నాడు. తనకి కవాల్సిన ఖచ్చితమైన శిల కోసం కొండలను దాదాపు 20
మీటర్ల వరకు తవ్వాల్సి ఉంటుంది. అతని దగ్గర ఉన్న పాత పరికరాలతో అంత లోతు వరకు తవ్వటం పూర్తి శ్రమతో కూడుకున్నది. అనుకూలమైన శిలను గుర్తించి దాన్ని అద్భుతంగా చెక్కటానికి ఖచ్చితంగా గొప్ప నైపుణ్యం అవసరం.

పెద్ద పెద్ద శిలలను చిన్న చిన్న వంట పరికరాలుగా చెక్కేందుకు సలీం దాదాపు 200 పనిముట్లను ఉపయోగిస్తాడు. కుండలు, ప్లేట్లు, కప్పులు, సాసర్లు, స్పూన్లు, చివరికి ఫోర్క్స్ కూడా అతను చెక్కగల అద్భత నైపుణ్యాన్ని సాధించాడు సల్మాన్. శిలతో రూపుదిద్దుకున్న వంట పరికరాల్లో వండివార్చిన ఆహారం ఎంతగానో రుచిగా ఉంటుందని సల్మాన్ అంటున్నాడు.

అయితే..తన ప్రతిభకు కారణం తన తండ్రే అని చెబుతున్నాడతను. 'నా తండ్రి గొప్ప శిల్పి. నేను ఇప్పుడు ఉపయోగిస్తున్న నైపుణ్యం గురించి మా తండ్రి 35 ఏళ్లకు పూర్వమే చెప్పాడు. చెక్కేందుకు అనుకూలంగా ఉండే శిలను పర్వాతాల్లో ఖచ్చితంగా గుర్తించటం, దాన్ని ఎలా సుందరమైన పరికరంగా మలచాలో మా తండ్రి నుంచే నేర్చుకున్నాను. అయితే..నా విద్యను నా వారసులు నేర్చుకునేందుకు ఇష్టపడటం లేదు. ఇది ఎంతో కష్టంతో కూడుకున్న విద్య అని వాళ్ల అభిప్రాయం' అని సల్మాన్ చెబుతున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com