తెరాస NRI కువైట్ ఆధ్వర్యంలో KCR 66వ పుట్టినరోజు సంబురాలు
- February 16, 2020కువైట్:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 66వ పుట్టినరోజు వేడుకలు తెరాస NRI కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది.తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ మహా నేతకు మొక్క కానుక అనే పిలుపు మేరకు అలాగే తెరాస NRI కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల సూచనలతో తెరాస NRI కువైట్ కమిటీ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం జరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.ఇప్పటికే తెలంగాణ లో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి బంగారు తెలంగాణ వైపు బాటలువేయిస్తున్నారు.అలాగే తొందర్లో NRI పాలసీని ప్రకటించాలని కోరుకుంటున్నాం.
కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో అధ్యక్షురాలు అభిలాష గొడిశాల మరియు కమిటీ సభ్యులు సరోజ భాను, గంగాధర్, సురేష్ గౌడ్, దివ్య రవి గరినే, రవి గన్నరపు, కొండల్ రెడ్డి, రవి సుధగాని, జగదీశ్, అయ్యప్ప, గణేష్ మన్నే తదితరులు పాల్గొన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు