తెరాస NRI కువైట్ ఆధ్వర్యంలో KCR 66వ పుట్టినరోజు సంబురాలు
- February 16, 2020
కువైట్:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 66వ పుట్టినరోజు వేడుకలు తెరాస NRI కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది.తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ మహా నేతకు మొక్క కానుక అనే పిలుపు మేరకు అలాగే తెరాస NRI కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల సూచనలతో తెరాస NRI కువైట్ కమిటీ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం జరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.ఇప్పటికే తెలంగాణ లో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి బంగారు తెలంగాణ వైపు బాటలువేయిస్తున్నారు.అలాగే తొందర్లో NRI పాలసీని ప్రకటించాలని కోరుకుంటున్నాం.
కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో అధ్యక్షురాలు అభిలాష గొడిశాల మరియు కమిటీ సభ్యులు సరోజ భాను, గంగాధర్, సురేష్ గౌడ్, దివ్య రవి గరినే, రవి గన్నరపు, కొండల్ రెడ్డి, రవి సుధగాని, జగదీశ్, అయ్యప్ప, గణేష్ మన్నే తదితరులు పాల్గొన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు