హరిత హారం కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు హరీష్ శంకర్,ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
- February 17, 2020
ప్రముఖ సినీ దర్శకుడు హరీష్ శంకర్,టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా మొక్కలు నాటాలని టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల పిలుపు మేరకు ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆద్వర్యంలో బంజారా హిల్స్,ఎమ్మెల్యే కాలనీలోని దర్శకుడు హరీష్ శంకర్ ఆఫీస్ పరిసరాల్లో హరితహారం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ- ‘‘మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి జన్మదిన శుభాకాంక్షలు.ఆయన చేపట్టిన ప్రతిష్టాత్మక హరితహారం కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను.పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి పై ఉంది.ప్రజలందరూ మొక్కలు నాటాలని కోరుతున్నాను.అలాగే నా బాల్యమిత్రుడు,ఎమ్మెల్యే క్రాంతికిరణ్ తో కలిసి ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం సంతోషంగా ఉంది’’ అన్నారు.
ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మాట్లాడుతూ: ‘‘మన సి.ఎం కేసీఆర్ కి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రమంతా ఈ రోజు అందరూ ఈ హరితహారం కార్యక్రమంలో పాల్గొంటున్నారు.ఎంపి సంతోష్ కుమార్ గారి గ్రీన్ చాలెంజ్ లో భాగంగా నేను ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించి, తన బిజీ షెడ్యూల్ లో కూడా సమయం కేటాయించిన నా మిత్రుడు,డైరెక్టర్ హరీష్ శంకర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు.’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ మన్నె కవిత తో పాటు సీనియర్ జర్నలిస్టులు పి.వి శ్రీనివాస్, వై.జె రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!