మహిళలూ అర్హులే.. సుప్రీం ఆదేశాలు
- February 17, 2020
న్యూఢిల్లీ: ఆర్మీలో మహిళా అధికారులకు శాశ్వత గ్రాంట్ కమిషన్ హోదా కల్పించాలంటూ కేంద్రానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. మహిళలకు పురుషులతో సమానంగా అన్ని అవకాశాలు కల్పించాలని పేర్కొంది. మహిళలకు పర్మినెంట్ గ్రాంట్ కమిషన్ హోదా కల్పించడంపై గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సమర్థించింది. మహిళల సామర్థ్యంపై ప్రభుత్వం తన ఆలోచనా ధోరణి మార్చుకోవాలని.. కమాండ్ విధులకు మహిళా అధికారులు కూడా అర్హులేనని తేల్చి చెప్పింది. మహిళా అధికారులకు 3 నెలల్లో శాశ్వత కమిషన్ హోదా కల్పించాలని ఆదేశించింది.
మహిళలకు శాశ్వత గ్రాంట్ కమిషన్‌పై 2010లో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. కమాండ్ హోదాలో మహిళలకు అవకాశం కల్పించడం కష్టసాధ్యమని సుప్రీం కోర్టుకు కేంద్రం విన్నవించింది. దీనిపై సుప్రీం తాజా ఆదేశాలు ఇచ్చింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!